Revanth Reddy | ఢిల్లీకి సీఎం రేవంత్
Revanth Reddy | ఢిల్లీకి సీఎం రేవంత్
ఆంధ్రప్రభ, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం (జూన్ 11న) జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
