విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి..

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి..

  • ఎమ్మెల్యే మందుల సామెల్

మోత్కూర్, ఆంద్రప్రభ : విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని, చదువులో ఉన్నతంగా రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆకాంక్షించారు. సోమవారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో జిల్లా పరిషత్ మోత్కూర్ ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షల్లో 500 కు పైగా మార్కులు సాధించిన 21మంది విద్యార్థులను ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ బోధన అందుతుందని, వాటి ఫలితంగా పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను శాలువా ,మెమెంటో, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. త్రిబుల్ ఐటీ బాసరలో ప్రవేశం పొందిన కొక్కుల ఉషశ్రీ ని నగదు పురస్కారం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవినేని అరవిందరాయుడు, ఉపాధ్యాయులు ఇండ్ల.రాంప్రసాద్ ,బత్తిని .రామకృష్ణ ,ధర్మారపు వెంకటయ్య,జినుకల ప్రవీణ్, జె.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.