ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధనలు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య బోధనలు చేపట్టడం జరుగుతుందని పెద్ద జట్రం సర్పంచ్ వాకిటివెంకటేష్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బడి ఈడు కలిగిన బడిబాటి పిల్లలను బడిలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు.
విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు నోటుబుక్కులు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం నిర్వహించడంతోపాటు విద్యతోపాటు క్రీడారంగంలో తీర్చిదిద్దుతుందనిఅన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ బడుల్లో చేర్పించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తూ విద్యార్థులకు నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా కంప్యూటర్ విద్య అందిస్తుందని అన్నారు. ఇంటింటికి తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు గౌరమ్మ, తిమ్మప్ప, వార్డుసభ్యుడు సోమేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కిరణ్ కుమార్, ఉపాధ్యాయ బృందం, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు,
