తాగుబోతులకు అడ్డాగా మారిన రైతు వేదికలు..
చిలుపూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం సౌలభ్యాన్ని కలిగించేందుకు ప్రవేశపెట్టే పథకాలు పక్కదారి పడుతున్నాయి. గత ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు రైతు వేదికలను ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది . రైతు వేదికల నిర్మాణం ఆరంభం నుండే ఆటంకాలకు గురవుతున్నాయి. వీటి నిర్మాణాల గ్రామానికి మధ్యలో ఉండాల్సి ఉండగా ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడే నిర్మించాలని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి అధికారులు ఊరి చివరలో ఉన్న ప్రభుత్వ భూములను ఎంపిక చేసి నిర్మాణాలను చేపట్టారు.

ఊరికి దూరంగా ఉండటంతో అవి నేడు తాగుబోతులకు, పేకాటరాయులకు అడ్డగా మారినాయి. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాల కు నిలయంగా మారాయి. చిలుపూర్ మండల పరిధిలోని రాజవరం గ్రామ క్లస్టర్ కు చెందిన రైతు వేదిక ఊరికి దూరంగా నిర్మించగా ఆ భవనానికి ఉన్న ప్రధాన ద్వారము తో పాటు కిటికీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి దానికి తోడు తాగుబోతులకు అడ్డాగా మారి పరిసరాల్లో రైతు వేదిక లోపల మద్యం తాగిన ఖాళీ సీసాలను వదిలి పోతున్నారు.
పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉండగా ఇలాంటి కార్యకలాపాలు చేయకూడదనే ఇంగిత జ్ఞానం తాగుబోతులకు లేకుండా పోయింది. డివిజన్ పరిధిలో ఉన్న రైతువేదికల్లో 10% మాత్రమే రైతులకు ప్రయోజకారిగా ఉన్నాయని, మిగిలిన అన్ని కూడా పాడైపోయినట్లు చెబుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు వేదికలను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
