పవన్ నోరు అదుపులో పెట్టుకో..తెలంగాణ ప్రజల్లో దయాగుణం
పవన్ నోరు అదుపులో పెట్టుకో..తెలంగాణ ప్రజల్లో దయాగుణం
…జనసేన పోటీ చేసినా నష్టం లేదు..… మంత్రి అడ్డూరి లక్ష్మణ్
వెల్గటూర్ ఆంధ్రప్రభ : నోరు ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హితవు పలికారు.
బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మీ జాగీర అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. నోరు ఉందని పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి పై ప్రభుత్వ నిబంధనల ప్రకారం సభ నిర్వహణకు అనుమతి ఇస్తారని,
పవన్ కళ్యాణ్ ను హీరోగా అందరూ అభిమానిస్థారన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు అన్నదమ్ములు లాగా కలిసి ఉంటున్నారని, భారత దేశంలోనే తెలంగాణ ప్రజలకు ఉన్న మంచి మనసు ఎవరికీ ఉండదన్నారు. తెలంగాణ ప్రజలు దయా గుణంతో ఉంటారని వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరో మారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.
తెలంగాణలో జనసేన పోటీ చేసినా కాంగ్రెస్ కు వచ్చిన నష్టమేం లేదని పవన్ నోర్పులో నోరు అదుపులో పెట్టుకొని మరోసారి పిచ్చికూతలు కూయొద్దన్నారు.
