40 లక్షల విలువ గల ధాన్యం ధ్వంసం..

40 లక్షల విలువ గల ధాన్యం ధ్వంసం..

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని రాయపాడు పంచాయతీకి చెందిన రైతు పెండకట్ల పెద్దలయ్య అనే రైతు 40 క్వింటాల మొక్కజొన్నలు 10 క్వింటాళ్ల వరిధాన్యం, 70 ప్లాస్టిక్ పైపులు రెండు, స్ప్రేయర్లు, 10ఎరువుల బస్తాలు కలుపుకొని మొత్తం సుమారు 3 లక్షల పంట ధాన్యం అగ్నికి ఆహుతి అయిందని రైతు పేద్దులయ్య కన్నీరు మున్నీరుగా విలపించారు. రైతు పెద్దలయ్య, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సాయంత్రం వేళలో గుర్తు తెలియని వ్యక్తులు కొంత అగ్గిరవ్వను వేశారని అనుమానం వ్యక్తం చేశారు. దాంట్లో 3 లక్షల పంట నష్టం వాటిల్లిందని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు కాలం కష్టపడి వ్యవసాయ సేద్యం చేసినప్పటికీ, నోటికాడికి వచ్చిన, చేతికి వచ్చిన పంట కళ్ళ ముందే అగ్నికి ఆహుతి కావడం చూసి దుఃఖక్రాంతులకు గురయ్యానని అసహనం వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రాలలో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పంటపొలాల్లోనే ధాన్యం నిలువ ఉంచాల్సిన దుస్థితి నెలకొందని మొక్కజొన్న పంటలు వరి పంటలు అగ్నికి పశువుల పాలవుతున్నాయని ఆగ్రహానికి గురయ్యారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పక్షపాతి అని చెప్పుకుంటూనే శాపంగా మారిందని అనడంలో ఎలాంటి సందేహం లేకపోలేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మొక్కజొన్న ధాన్యం వరి పంటలను తక్షణమే కొనుగోలు చేసి రైతు ఖాతాల్లో నగదు జమ చేయాలని ఎలాంటి కొర్రీలు ఆంక్షలు లేకుండా రైతులు పండించిన పంటలను సర్వేగంగా కొనుగోలు చేసి గోదాములకు తరలించే కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఆళ్లపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న, వరి ధాన్యాలను కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయకపోవడమే నష్టానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా తక్షణమే వరి ధాన్యం మొక్కజొన్న పంటలను గోడాంలకు తరలించాలని నష్టపోయిన రైతు పేద్దులయ్య 3 లక్షల పంట నష్టం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించే దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.