చౌటుప్పల్ మండలంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

చౌటుప్పల్ మండలంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం నూతన గృహాలను జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, ఆయా గ్రామాల సర్పంచులు ప్రారంభించారు.

మండలంలోని ఎల్లంబావి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న ఏలే మహేశ్వరీ – ఉపేందర్ కుటుంబం గృహప్రవేశ కార్యక్రమానికి జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి హాజరయ్యారు. నూతన గృహాన్ని ప్రారంభించిన అనంతరం, ఇల్లాలికి చీర, పండ్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి డి. రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

అంకిరెడ్డిగూడెంలో ఇళ్ల ప్రారంభం

చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామంలో ప్రభుత్వ పథకం కింద మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్ ప్రారంభించారు.

గ్రామానికి చెందిన లబ్ధిదారులు సుర్వి రజిని మదన్ మోహన్ గౌడ్, నల్ల పార్వతమ్మ నరసింహ నేత, బడుగు పారిజాత రాములు నేత, చేపూరి సుగుణమ్మ సత్తయ్య, మోడెపు యాదమ్మ కుమార్‌ల నూతన గృహాలను సర్పంచ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. గ్రామ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బత్తుల అనుష మహేష్ గౌడ్, దొడ్ల అండాలు శెట్టయ్యగౌడ్, రాపోలు రేణుక మల్లేష్, మాజీ సర్పంచ్ సుర్వి సత్తయ్య గౌడ్, యాట శంకరయ్య, ఐకేపీ మహిళా సంఘం అధ్యక్షురాలు పెండెం లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి గంగాపురం పాండుగౌడ్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

ఆరెగూడెంలో గృహప్రవేశం

చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామంలో పిసాటి లక్ష్మి నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎన్నెపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ధనలక్ష్మి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిమ్మల సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జాల మల్లేష్ యాదవ్, వార్డు సభ్యులు గంగనబోయిన శ్రీశైలం, పల్లె లింగస్వామి, గంగనబోయిన వెంకటేశం, అనంతుల వెంకటేశం, మారగోని రాధిక, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు పిసాటి నాగరాజు రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply