ఇందిరమ్మ ఇంటితో లబ్ధిదారి కుటుంబంలో ఆనందం

ఇందిరమ్మ ఇంటితో లబ్ధిదారి కుటుంబంలో ఆనందం
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ:
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నెరవేర్చుతోందని సర్పంచ్ భూక్య వసుంధర అన్నారు. భీమ్‌గల్ మండలంలోని సుదర్శన్ నగర్ తండాలో ఇందిరమ్మ లబ్ధిదారులు నూతనంగా నిర్మించుకున్న ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎల్లల శ్రీనివాస్ హాజరయ్యారు. స్థానిక సర్పంచ్ భూక్య వసుంధరతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వసుంధర మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వ పాలనలో ఏ గ్రామంలోనూ పేదవారు గుడిసెల్లో ఉండకుండా, సొంతింటిలో నివసించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనిపించడం సంతోషకరమని అన్నారు.
లబ్ధిదారులు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం పేదలను గుర్తించి సొంతింటి కలను నెరవేర్చిందన్నారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూక్య సురేష్, వార్డు సభ్యులు ఎల్. కుర్తిలాల్, ఎం. దేవిసింగ్, పట్టణ అధ్యక్షుడు అనంతరావు, వాక మహేష్, సర్పంచ్ శివ నాయక్, పంచాయతీ కార్యదర్శి సమత పాల్గొన్నారు.
