Jana-Sena-Angry : అయినా సభ ఆగదు Andhra Prabha Top News

Jana-Sena-Angry : అయినా సభ ఆగదు Andhra Prabha Top News
- జనసేన వెల్లడి
- పోలీసుల అనుమతి నిరాకరణ
- న్యాయపోరాటంలో జనసేన లీగల్ టీమ్
( ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్)
తెలంగాణ హైదరాబాద్ లో మరి కొన్ని గంటల్లో జనసేన పార్టీ నిర్వహించే
జనసేన సాధక్ సమ్మేళనం , తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు తెలుగు రాష్ట్రాల్లోని జన సైనికులు ఉర్రూతలూగుతున్న తరుణంలో… ఈ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ నిర్ణయంపై జనసేనాని కూడా సీరియస్ గానే స్పందించారు. ఎట్టి పరిస్థితిలోనూ హైదరాబాద్ లో ఈ సభపు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ స్థితిలో.. ఒక పక్కన హైకోర్టులో న్యాయపోరాటానికి జనసైనికులు సిద్ధం కాగా.. హైకోర్టు అనుమతి వచ్చినా.. రాక పోయినా.. సభను నిర్వహించి తీరుతామని జనసైన్యం ప్రత్యామ్నయ ఏర్పాట్లల్లో నిమగ్నమైంఇ. ఈ స్థితిలో తెలుగు రాష్ట్రాల్లో నరాలు తెగే ఉత్కంఠత నెలకొంది. ఉద్రిక్త ముఘాలు అలుముకొంటున్నాయి. సభ నిర్వహిణకు కొన్ని గంటల ముందే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అనుమతి నిరాకరించింది? అసలు కథ ఏమిటి?
Jana-Sena-Angry : గొడవకు కారణం…!
తెలంగాణలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం , జనసేన పార్టీ విస్తరణ, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా కార్యకర్తలు, కీలక నేతలతో సమావేశం నిర్వహించేందుకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఈ సమావేశం కబురుతో తెలంగాణాలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఇటీవల సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, పవన్ కళ్యాణ్ పట్ల చేసిన కొన్ని రాజకీయ విశ్లేషణాత్మక వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై జనసేన తెలంగాణ శ్రేణులు తీవ్రంగా స్పందించగా.. , నాగేశ్వర్ ప్రెస్‌మీట్ సందర్భంగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తెలంగాణలో ఒక వర్గం జర్నలిస్టులు పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పర్యటనను, ఆయన నిర్వహించ తలపెట్టిన సభను వ్యతిరేకిస్తూ కొన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది.
Jana-Sena-Angry : ముట్టడికి సన్నద్ధం
: పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణపై చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర సార్వభౌమత్వాన్ని, ప్రజలను అవమానించేలా ఉన్నాయంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు, పలు విద్యార్థి, ఉద్యమ సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే సభ పెట్టాలని, లేదంటే సభా వేదికను ముట్టడిస్తామని కొన్ని సంఘాలు బహిరంగంగా ప్రకటించాయి
Jana-Sena-Angry : అనుమతి నిరాకరణ
హైదరాబాద్ గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సెంటర్ వేదికగా జూన్ 2న జరగాల్సిన జనసేన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ కు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందుకు ప్రధాన కారణాలు ఏమిటంటే,
జర్నలిస్టుల ఆందోళనలు, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ లేదా ర్యాలీలకు అనుమతి ఇస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంతర్గతంగా పోలీసులు భావించారు. దీనికి తోడు జూన్ 2 న అధికారికంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి. నగరం అంతటా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు భారీగా పోలీసు భద్రతను బందోబస్తును కేటాయించాలి. ఒకే సమయంలో జనసేన భారీ సభకు అదనపు పోలీసు బలగాలను, భద్రతను కల్పించడం సాధ్యం కాదని పోలీసులు తమ వాదనలో పేర్కొన్నారు.
Jana-Sena-Angry : జనసేనలో ఆగ్రహం
తమ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ, అనుకున్న షెడ్యూల్ ప్రకారం సభను నిర్వహించుకునేందుకు జనసేన లీగల్ టీమ్ ఇప్పటికే కోర్టును (హైకోర్టు) ఆశ్రయించేందుకు సిద్ధమైంది, అవసరమైతే వేదిక మార్చి సభను నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ఱయం తీసుకుంది. తెలంగాణలో తమ పార్టీని అణచివేయాలని చూస్తున్నారని జన సైనికులు ఆరోపిస్తున్నారు.
Jana-Sena-Angry : సభ ఆగదు..
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ , “సభ జరిగి తీరుతుంది . అడ్డంకులు ఎదురైనప్పటికీ వెనక్కి తగ్గేదే లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి ఆయన ఒక ‘రోడ్ మ్యాప్’ సిద్ధం చేశారు. అనుమతుల విషయంలో ఆంక్షలు ఉన్నప్పటికీ, జూన్ 2న హైదరాబాద్ వేదికగా తెలంగాణ జనసేన ముఖ్య నేతలు, కార్యకర్తలతో అంతర్గత లేదా ప్రైవేట్ వేదికలపై కీలక సమావేశం నిర్వహించి తీరుతామని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. జనసేనపై జరిగే దాడులను, అసత్య ప్రచారాలను ఇకపై సహించేది లేదని, భవిష్యత్తులో వీటికి తీవ్ర పర్యావసనాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ ఇప్పటికే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సభ ద్వారా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల తర్వాత స్థానికంగా మరింత బలపడాలని, క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని జనసేనాని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు, ఇప్పటికే.. : ఈ సభకు ముందే తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీలో చేరేందుకు వివిధ వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా మల్కాజ్గిరి నుంచి ఉద్యమకారులు, ఇతర పార్టీల నాయకులు భారీగా జనసేనలో చేరుతున్నారు. ఈ స్థితిలో… తెలంగాణలో జనసేనకు బ్రేకులు వేయటానికి రాజకీయ వర్గాలు వెనుకాడటం లేదని జనసైనికులు వాదిస్తున్నారు.
