ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల సొంతింటి కల సాకారం

తొర్రూరు, ఆంధ్రప్రభ; నిరుపేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లతో సాకారం అవుతుందని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ పలు నూతన గృహాలను ప్రారంభించారు. ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

పేద ప్రజల చిరకాల వాంఛను ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నాయకత్వంలో పేదలకు నివాస సదుపాయం అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పేదలకు ఇళ్లు అందించకుండా మోసం చేసిందని చైర్మన్ విమర్శించారు. రెండో విడతలో కూడా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply