Paddy Procurement | మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి

Paddy Procurement | మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి

Paddy Procurement | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ధాన్యం కొనుగోళ్లు వేగ‌వంతంగా చేప‌ట్టాల‌ని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు (సోమ‌వారం) సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, ఫణిగిరిలలోని వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ గురించి ఆరా తీశారు. రైతులు, అధికారులతో ఆయ‌న మాట్లాడారు. సేకరించిన ధాన్యాన్ని వెంట‌నే మిల్లుల‌కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీ సమయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మండుల శామ్యూల్, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనతో పాటు ఉన్నారు.

Leave a Reply