Monkey Viral | నోట్ల కోసం జనం ఉరుకులు పరుగులు!

Monkey Viral | నోట్ల కోసం జనం ఉరుకులు పరుగులు!
Monkey Viral | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మీరు సినిమాల్లో ధనవంతులు నోట్ల కట్టలను గాల్లోకి విసిరేయడం చూసుంటారు. కానీ, ఇక్కడ ఒక కోతి మాత్రం ఏకంగా లక్షల రూపాయల నోట్లను చెట్టుపై కూర్చుని గాల్లోకి విసిరేస్తూ.. కింద ఉన్న జనానికి కాసుల వర్షం కురిపించింది. ఆ ఘటన ఉత్తరప్రదేశ్ చోటుచేసుకో.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ మారింది..
వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఓ న్యాయవాది ఆస్తి రిజిస్ట్రేషన్ పనుల కోసం తన బ్యాగులో రూ. 2 లక్షల నగదు పెట్టుకుని రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరు వచ్చాడు. అయితే, అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్న కోతి క్షణాల వ్యవధిలో సదరు లాయర్ చేతిలోని బ్యాగ్‌ను లాక్కుని టకటకా పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు పైకి ఎక్కేసింది. వెంటనే బ్యాగులో తినుబండారాలు ఏమైనా ఉన్నాయేమోనని ఆ కోతి వెతకడం ప్రారంభించింది.
బ్యాగులో తినడానికి ఏమీ దొరక్కపోయేసరికి కోతికి కోపం వచ్చిందో ఏమో కానీ.. అందులోని కరెన్సీ నోట్ల కట్టలను బయటకు తీసి గాల్లోకి విసరడం మొదలుపెట్టింది. చెట్టుపై నుండి వందల, ఐదు వందల నోట్లు గాల్లో తేలుతూ కింద పడుతుంటే అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.
ఆకాశం నుండి నోట్లు రాలుతుండటాన్ని చూసిన స్థానికులు, దారిపోయే వారు ఆ డబ్బును ఏరుకోవడానికి ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడ కాసేపు పెద్ద కలకలమే రేగింది. కాసేపటి పాటు నోట్లతో ఆటలాడుకున్న ఆ కోతి, ఆ తర్వాత ఖాళీ బ్యాగ్‌ను కింద పడేసి అక్కడి నుండి వెళ్లిపోయింది.
ఈ దృశ్యాన్ని అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఏది ఏమైనా ఆ లాయరికి మాత్రం ఈ కోతి కోలుకోలేని షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
