సాయిపేట అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ..

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలో ప్రధాన రహదారి వెంట సైడ్ డ్రైన్ లేక మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో వెంటనే సైడ్ డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గ్రామ సర్పంచ్ కు సూచించారు.

డ్రైనేజి నిర్మాణానికి 15లక్షలు మంజూరు ఇస్తానని అతి త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ భవనం మంజూరు అయిందని అన్నారు. త్వరలోనే రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సాయిపేట గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మి నాగరాజు, ఉప సర్పంచ్ రాజేందర్, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply