Delhi Fire Accident | ఏసీ నుంచి మంటలు చెలరేగినట్లు అనుమానం
Delhi Fire Accident | ఏసీ నుంచి మంటలు చెలరేగినట్లు అనుమానం
Delhi Fire Accident | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ కార్యాలయంలో ఇవాళ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వికాస్మార్గ్లో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ) భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భవనంలో ఉన్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన అంతస్తులో విద్యాశాఖ కార్యాలయాలు, అధ్యాపకుల క్యాబిన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. అయితే కార్యాలయానికి సంబంధించిన కొన్ని కీలక దస్త్రాలు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో ఎయిర్ కండీషనర్ (ఏసీ)లో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తించిన అధికారులు, ఖచ్చితమైన కారణాలపై మరింత విచారణ చేపట్టారు.
