ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఏఎంసీ చైర్మన్

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఏఎంసీ చైర్మన్

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ మండలం రామకోటిపురం పంచాయతీ పరిధిలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ముఖాల్లో ఆనందం చూడటమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ క్లస్టర్ ఇంచార్జ్ బండే రాఘవ,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొప్పన నందం,దాసినేని శ్రీనివాసరావు,షేక్ బాబావలి,బొప్పన కాశీ విశ్వేశ్వరరావు,బొప్పన వీరేంద్ర కుమార్,పులిగడ్డ నాంచారయ్య,రేపల్లె అంకినీడు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply