విద్యుత్ తీగలకు తాకి లారీ దగ్ధం…

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం రంగాపూర్ లో ప్రభాకర్ చెందిన విబిఎస్ ఇటుక బట్టీలో మట్టి టిప్పర్ మంటల్లో దహనం అయ్యింది. చెరువు నుండి బట్టీకి మట్టిని తరలించిన టిప్పర్ బట్టీ వద్ద మట్టిని అన్ లోడ్ చేస్తుండగా 11 కెవి విద్యుత్ లైన్ కు తగలడంతో మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ ప్రమాదం నుండి బయటపడ్డాడు. బట్టీలకు మట్టి తరలింపులో నిర్లక్ష్యం భారీ ప్రమాదానికి దారి తీసింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో మట్టి తరలిస్తున్న బట్టీ యజమాని, లారీ ఓనర్ ఊపిరి పీల్చుకున్నాను.

Leave a Reply