రెండో రోజు మున్సిపల్ కార్మికుల ధర్నా

రెండో రోజు మున్సిపల్ కార్మికుల ధర్నా
వికారాబాద్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని గుర్తింపు కార్డులను వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మార్పీ చౌరస్తా వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికుల సంఖ్య 400 పెంచాలి.. పని భారం తగ్గించాలని.. యూనిఫారం కుట్టుకూలి 1200 ఇవ్వాలి. హెల్త్ కార్డులు ఇవ్వాలి. రిపేర్ లో ఉన్న ఆటోలు ట్రాక్టర్లు వెంటనే రిపేర్ చేయించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్స్ సౌకర్యం నెలకు పదివేలు ఇవ్వాలి. 2వ రోజు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో MRP చౌరస్తాలో నిరసన తెలియచేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, సిఐటియూ నాయకులు ఆర్ మహిపాల్ మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించి తెచ్చుకున్న కార్మిక చట్టాలను, బీజేపీ ప్రభుత్వం నీరుగారిస్తుంది. అదే పనిలో రాష్ట్ర ప్రభుత్వo అమలు చేయడం వ్యతిరేకించాలి. వెంటనే రద్దు చేయాలి. 8 గంటల పని విధానం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26 వేలు అమలు చేయాలి.
ప్రమాద భీమా సౌకర్యం 20 లక్షలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నేటి నుండి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వికారాబాద్ లో 34 వార్డులు, 10జోన్లు, ఉన్నవి. కార్మికుల సంఖ్య 264 నుండి 400 మంది వరకు పెంచాలి అన్నారు. ఈ నిరసన ధర్నా2వ రోజు ఎమ్మార్పీ చౌరస్తాలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ CITU వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, నాయకులు బుచ్చయ్య, జ్యోతి జాఫర్ రవి, ఇలియాస్ మంగమ్మ, లచ్చమ్మ, నర్సింలు శివ కుమారు, ఆశ, రాఘవేంద్ర, సామిల్, కమల, బుచ్చయ్య జంగమ్మ, బాబు, లక్ష్మీ, రాజు తదితరులు పాల్గొన్నారు.
