​ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి..

మేడ్చల్, ఆంధ్రప్రభ : రేపు పేరేడు గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యదర్శి సింగిరెడ్డి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మేడ్చల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి మేడ్చల్ సర్కిల్ పరిధిలోని ప్రతి వార్డు, గ్రామం నుండి భాజపా నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

పేరేడు గ్రౌండ్ లక్ష్యం ప్రధాని మోదీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.మేడ్చల్ సర్కిల్ పరిధిలోని అనుబంధ సంఘాల సభ్యులు కార్యకర్తలు పాల్గొనాలని తెలియజేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి ఈ సభ ఒక వేదిక అని, మేడ్చల్ ప్రాంతం నుండి భారీ జనసమీకరణ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. క్రమశిక్షణతో, ఉత్సాహంతో అందరూ పాల్గొని ఈ సభను చారిత్రాత్మక విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.