చిన్నారుల భవిష్యత్తుపై కొత్త దిశ..

చిన్నారుల భవిష్యత్తుపై కొత్త దిశ..
అంగన్వాడీల బలోపేతానికి చర్యలు
ఊట్కూర్ ఆంధ్రప్రభ: అంగన్వాడీ కేంద్రాల బలపేతానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని మల్లేపల్లి సర్పంచ్ సత్యం రంకథలప్ప అన్నారు.
శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల నమోదు పెంచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రతి చిన్నారిపై వ్యక్తిగత శ్రద్ధతో అక్షరజ్ఞానంతో పాటు ఆటపాటలు నేర్పించడమే లక్ష్యమని చెప్పారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా పిల్లలను అంగన్వాడీల్లో చేర్పించాలని ప్రజలకు సూచించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో “అమ్మ మాట – అంగన్వాడీ బాట” అమలు జరుగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
