గిరిజన సంస్కృతికి వేదికగా మారిన వేడుకలు..

నిజాంపేట్, ఆంధ్రప్రభ : తాండాల అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
నిజాంపేట్ మండలం బచ్చురాజ్‌పల్లి గ్రామంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్, దుర్గా భవాని అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా గిరిజన మహిళలు నిర్వహించిన సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యాల్లో పాల్గొన్నారు. ఆమె నృత్య ప్రదర్శనకు గ్రామస్థులు, యువత హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
అనంతరం సేవాలాల్ మహారాజ్, దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు ఆనందంగా ఉండాలని, వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. గిరిజనుల అభ్యున్నతికి సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
తాండాలను గ్రామపంచాయతీలుగా మార్చి స్వయం పాలనకు అవకాశం కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.
రానున్న రోజుల్లో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పద్మా దేవేందర్ రెడ్డిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నందిగామ-నిజాంపేట్ పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, నిజాంపేట్, రజక్పల్లి, నస్కల్ గ్రామాల బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, నాగరాజు, వెంకటేష్, దుర్గయ్య, మాజీ ఎంపీపీ సంపత్, మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ అజీజ్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు బజారు రంజిత్ గౌడ్, మాజీ సర్పంచ్ గోపరి నరసింహులు, మాజీ ఎంపీటీసీ పున్న వెంకటస్వామి, నాయకులు శ్రీకాంత్ గౌడ్, లచ్చపేట రాములు, వెంకటేశం, నరేందర్ నాయక్, శివలింగం, నగేష్, మంగ్య నాయక్, లక్ష్మీ నరసింహులు, కొమురయ్య, బండారి తిరుమల్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
