వడదెబ్బతో ఒకరు మృతి..

దండేపల్లి, ఆంధ్రప్రభ : వడదెబ్బతో ఒకరు మృతి చెందిన సంఘటన దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది.బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం జైతూగుడా గ్రామానికి చెందిన ఆత్రం రాజేష్(50)మృతి చెందాడు మృతుడు రాజేష్ రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం కూలీపనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా అక్కడే కళ్లుతిరిగి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఇంటికి తీసుకెళ్లారు.వడదెబ్బ తగలడంతోనే వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం లక్షెటిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, రాజేష్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్దారించడంతో. మృతునికి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తహసినోద్దీన్ తెలిపారు.
