IPL Final | ఆందోళ‌న‌లో ఐపీఎల్ అభిమానులు

IPL Final | ఆందోళ‌న‌లో ఐపీఎల్ అభిమానులు

IPL Final | ఫైనల్ మ్యాచ్‌పై వర్షం ప్రభావం?
టాస్ సమయానికి భారీ వర్షం ఛాన్స్
మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?
రన్‌రేట్‌తో బెంగళూరుకు లాభం?

IPL Final | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: ఐపీఎల్‌ 2026 టోర్నమెంట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ రేపు (ఆదివారం) జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు టైటిల్‌ కోసం తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ హై వోల్టేజ్‌ ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉండటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

మ్యాచ్‌ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. టాస్‌ సమయానికి దాదాపు 80 శాతం వర్షం పడే ఛాన్స్‌ ఉన్నట్లు చెబుతున్నారు. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగితే అదనంగా 120 నిమిషాల సమయం కేటాయించే అవకాశం ఉంది. అప్పటికీ వర్షం తగ్గకపోతే కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్‌ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు.

అది కూడా సాధ్యం కాకపోతే సూపర్‌ ఓవర్‌ ద్వారా ఫలితం తేల్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వర్షం తగ్గకపోతే మ్యాచ్‌ను మరుసటి రోజుకు వాయిదా వేసి కొనసాగించవచ్చు. రిజర్వ్‌ డే రోజున కూడా ఆట నిర్వహణ సాధ్యం కాకపోతే పాయింట్లు, నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా విజేతను ప్రకటించే అవకాశం ఉంది.

పాయింట్ల పట్టికలో బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు చెరో 18 పాయింట్లతో ఉన్నాయి. అయితే నెట్‌ రన్‌రేట్‌లో బెంగళూరు కాస్త ముందంజలో ఉంది. దీంతో మ్యాచ్‌ పూర్తిగా రద్దయితే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే గుజరాత్‌ టైటాన్స్‌కు భారీ నిరాశే మిగులుతుంది. ఈ నేపథ్యంలో వర్షం పడకూడదని గుజరాత్‌ అభిమానులు వరుణ దేవుడిని ప్రార్థిస్తున్నారు.

CLICK HERE TO READ 2026 IPL | 700+ పరుగుల మార్క్‌ను దాటేశారు

CLICK HERE TO READ MORE

Leave a Reply