భక్తుల కోసం తిరుమలలోకి మరో ఆధునిక సేవ

భక్తుల కోసం తిరుమలలోకి మరో ఆధునిక సేవ
తిరుమల ఆంధ్రప్రభ: తిరుమల తిరుపతి దేవస్థానానికి ఢిల్లీలోని నయాతి హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ఆగ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం రూ.1.13 కోట్ల విలువైన ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించింది.
ఈ సందర్భంగా సంస్థ అధినేత నీరా రాడియా శ్రీవారి ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి అందజేశారు.
కార్యక్రమం అనంతరం టీటీడీ చైర్మన్, అదనపు ఈవో దాతతో కలిసి బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులకు ఈ బస్సు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంటూ దాతను అభినందించారు.
భక్తుల సౌకర్యార్థం ఈ ఎలక్ట్రిక్ బస్సును తిరుమలలో ఉచిత బస్సు సేవగా వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు డి.పి. అనంత, తిరుమల ట్రాన్స్పోర్ట్ డీఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
