7th May 2026 | తిరుమల సమాచారం..

7th May 2026 | తిరుమల సమాచారం..

తిరుమలలో సాధారణ రద్దీ…
సర్వదర్శనానికి 8గంటల నిరీక్షణ
11 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనానికి సుమారు 8గంటల సమయం
టోకెన్‌ కలిగిన భక్తులకు 3 నుంచి 4 గంటల్లో దర్శనం
జూలై 15 వరకు అన్ని వీఐపీ సిఫారసు లేఖలు రద్దు
చిన్నారులకు ఉచితంగా ‘అక్షర గోవిందం’ కిట్ల పంపిణీ


7th May 2026 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. గురువారం (07-మే-2026) ఉదయం అందిన సమాచారం ప్రకారం… ఉచిత సర్వదర్శనం కోసం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుండగా, టోకెన్‌ కలిగిన భక్తులకు 3 నుంచి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది.

నిన్న ఒక్కరోజే శ్రీవారిని మొత్తం 71,029 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,184 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.07 కోట్లుగా నమోదైంది.

ఇక తాజా టిటిడి నిర్ణయాల్లో భాగంగా, వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేందుకు జూలై 15 వరకు అన్ని వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేసినట్లు టిటిడి బోర్డు ప్రకటించింది.

అలాగే చిన్నారుల కోసం ఉచితంగా ‘అక్షర గోవిందం’ కిట్లను పంపిణీ చేయాలని టిటిడి నిర్ణయించింది. మరోవైపు ఎస్‌ఎస్‌డీ, దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్లు కూడా అందుబాటులో ఉండి భక్తులకు సేవలు అందిస్తున్నాయి.