మొర్రిగూడెం విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ గ్రామపంచాయతీ పరిధిలోని మొర్రిగూడెం గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని కడెం మండల ఇన్‌చార్జి విద్యుత్ శాఖ ఏఈ ఎం. రాంసింగ్ హామీ ఇచ్చారు.
శనివారం గ్రామాన్ని సందర్శించిన ఆయన గ్రామస్తులతో సమావేశమై విద్యుత్ సమస్యలపై చర్చించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిశీలించిన అనంతరం వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే గ్రామం నుంచి పోచమ్మ ఆలయం వరకు సింగిల్ ఫేజ్ విద్యుదీకరణ పనులు చేపట్టి, స్ట్రీట్‌లైట్ల ఏర్పాటు కోసం ప్రత్యేక విద్యుత్ లైన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగెల భూషణ్, విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ రాజు నాయక్, ఉప సర్పంచ్ తక్కల్ల రమ్య–రవీందర్, వార్డు సభ్యుడు తాడికొండ వెంకటేష్, గ్రామస్తులు మల్లేష్, మురళి, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
