జన నాయకుడు.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు

జన నాయకుడు.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- తండ్రిని మించిన తనయుడిగా ఆదరణ..
- అభివృద్ధి, ప్రజాసేవలో ప్రత్యేక ముద్ర
- ఐటీ రంగంలో తెలంగాణకు కొత్త గుర్తింపు
- రాష్ట్ర నాయకత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తూ..
మంథని, ఆంధ్రప్రభ : జనం మెచ్చిన నాయకుడిగా ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తనదైన ముద్ర వేసుకున్నారు.. ఇటు తనను గెలిపించిన మంత్రపురి ప్రజలకు అందుబాటులో ఉంటూనే.. వారికి ఏ కష్టం వచ్చినా తీరుస్తూ.. అటు రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ.. ఐటీ రంగంలోనూ తన విశిష్ట సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు.. అభివృద్ధి, ప్రజా సేవలో తండ్రిని మించిన తనయుడిగా ఆదరణ పొందుతున్నారు.. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ జనం మెచ్చిన నాయకుడిగా ఎదిగిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం..
ప్రజాసేవే పరమావధిగా..
సాధారణ కార్యకర్త నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా శ్రీధర్ బాబు ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో ముందుకు సాగుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం, తెలంగాణను సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలిపే దిశగా కృషి చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

ప్రజాసేవే పరమావధిగా..
సాధారణ కార్యకర్త నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా శ్రీధర్ బాబు ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో ముందుకు సాగుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టు బడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం, తెలంగాణను సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలిపే దిశగా కృషి చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వంలోనూ కీ రోల్..
కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర నాయకత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తూనే.. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సమర్థవంతంగా పని చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు కీ రోల్ పోషిస్తున్నారు. అలాగే తనకు రాజకీయ జన్మనిచ్చిన మంథని నియోజకవర్గ అభివృద్ధిపై, ఇక్కడి ప్రజల సమస్యల పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారు. డేంజర్ జోన్ సమస్యలు, భూనిర్వాసితుల అంశాలు, రైతుల ఇబ్బందులు వంటి స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ తీసుకుంటూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. సచివాలయంలో అధికారులు, జెన్కో ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

తండ్రికి తగ్గ తనయుడు..
దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ తండ్రికి తగ్గ తనయుడుగా ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నారు. విలువలతో కూడిన రాజకీయాలు, ప్రజల పట్ల నిబద్ధత, సేవాభావంతో ముందుకు సాగుతున్న నాయకుడిగా శ్రీధర్ బాబు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శనివారం మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని మంథని నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్లు, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అభిమానులు, కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఆయన రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత స్థాయి పదవులు అధిరోహించి.. మంత్రపురి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని మంథని ప్రజలు కోరుకుంటున్నారు.
