లారీల కోసం టోల్‌గేట్ వద్ద రైతుల నిరీక్షణ

లారీల కోసం టోల్‌గేట్ వద్ద రైతుల నిరీక్షణ

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: ఆరు కాలాలు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి తరలించేందుకు లారీల కొరత ఏర్పడటంతో గురువారం సాయంత్రం రైతులు హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న కొమల్ల టోల్‌గేట్ వద్ద లారీల కోసం నిరీక్షించారు.

ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ రఘునాథపల్లి మండల అధ్యక్షుడు వారాల రమేష్ యాదవ్ టోల్‌గేట్ వద్దకు చేరుకుని రైతులకు సంఘీభావం తెలిపారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లారీల కొరత కారణంగా ధాన్యం తరలింపు నిలిచిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక అధికారులకు ఫోన్ చేసి రైతుల సమస్యను వివరించారు.

ధాన్యం తరలింపుకు వెంటనే లారీలను అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి తరలించేలా చర్యలు తీసుకోవాలని రమేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మితండా సర్పంచ్ పయ్యావుల రవి యాదవ్, మాజీ ఎంపీటీసీ మాలోతు నర్సింహా నాయక్, పొట్టిగుబ్బడి తండా మాజీ సర్పంచ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply