చెప్పులు లేకుండా తోపుడు బండితో రైతు వినూత్న నిరసన

చెప్పులు లేకుండా తోపుడు బండితో రైతు వినూత్న నిరసన
ఆలేరు, ఆంధ్రప్రభ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరలింపు ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మణిపాల్ రెడ్డి అనే రైతు వినూత్నంగా నిరసన తెలిపారు.గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఆలేరు మార్కెట్ కమిటీ యార్డ్ వరకు ఆయన తోపుడు బండితో పాదయాత్ర చేపట్టారు.
కణకణ మండుతున్న ఎండలో తోపుడు బండిపై ధాన్యం సంచులు ఉంచుకుని, కాళ్లకు చెప్పులు లేకుండా తారు రోడ్డుపై సుమారు ఏడు కిలోమీటర్లు నడిచారు.ధాన్యం తరలింపు ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మణిపాల్ రెడ్డి తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
