బడుగు బలహీన వర్గాల భాషా జ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

చిట్యాల, ఆంధ్రప్రభ ; బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు నిరంతనం పాటుపడిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని బిజెపి పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీను తెలిపారు. చిట్యాల పట్టణ కేంద్రంలో కనకదుర్గ సెంటర్లో బిజెపి పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత న్యాయ కోవిదులు ఆర్థికవేత సామాజిక సంఘ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 జయంతి వేడుకలు సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీను, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాస శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరేళ్ల శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు చికలం మెట్ల అశోక్ కన్నబోయిన మహలింగం యాదవ్ బోడిగే అశోక్ బిజెపి పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శిలు జయారపు రామకృష్ణ గంజి గోవర్ధన్ బిజెపి సీనియర్ నాయకులు కుక్కల నాగరాజు పట్టణ నాయకులు తీగల శివ,చిలువేరు నాగరాజు,దొడ్డు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply