ప్రజా సంక్షేమం టీడీపీతోనే సాధ్యం: గద్దె అనురాధ

ప్రజా సంక్షేమం టీడీపీతోనే సాధ్యం: గద్దె అనురాధ

తిరువూరు, ఆంధ్రప్రభ దివంగత నందమూరి తారక రామారావు ఉన్నత ఆశయాలతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు.

గురువారం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజుపేట శ్రీరస్తు కన్వెన్షన్‌లో నిర్వహించిన మహానాడులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, మహిళా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నటికీ మరువలేనివని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకిచ్చిన మాటను తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకుందని, పేద వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.



Leave a Reply