ఎన్డీఏ కార్యాలయంలో ఏడో రోజు ప్రజా దర్బార్‌కు విశేష స్పందన

ఎన్డీఏ కార్యాలయంలో ఏడో రోజు ప్రజా దర్బార్‌కు విశేష స్పందన

భవానీపురం, ఆంధ్రప్రభ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో ఏడో రోజు నిర్వహించిన ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభించింది.

గురువారం నిర్వహించిన ఈ ప్రజా దర్బార్‌లో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), ఇతర మాజీ కార్పొరేటర్లు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విని పరిష్కార మార్గాలను సూచించారు.

ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు అందజేయగా, వాటిని సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మహాదేవు అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, మైలవరపు దుర్గారావు, కూటమి నేతలు సారిపల్లి రాధ కృష్ణ, బూర కనకరావు, బెవర శ్రీనివాసరావు, ఏలూరు సాయి శరత్, గంజి పవన్, ఈగల సాంబశివరావు, పిళ్ళ శ్రీనివాసరావు, దాడి మురళి కృష్ణ, సోము వెంకటేశ్వర్లు, బాల కోటి (దాసు), బొల్లేపల్లి కోటేశ్వరరావు, గన్నవరపు శ్రీనివాసరావు, శనివారపు శివ, గడ్డిపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply