వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి

వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి

జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన ముదేళ్ల మహేష్‌ (35) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన మహేష్‌ ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన మృతి చెందినట్లు పేర్కొన్నారు.

మృతుడు అవివాహితుడని సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply