యుద్ధప్రాతిపదికన ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్

యుద్ధప్రాతిపదికన ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్
దండేపల్లి, ఆంధ్రప్రభ:
రాష్ట్ర ఖజానా, ఖాతాల శాఖ , తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ దండేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమైంది.
ఈ నెల 31వ తేదీలోపు డిజిటలైజేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంఘర్ష రాజేశ్వరరావు మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులు తమ సర్వీస్ రిజిస్టర్లలోని వివరాలను పూర్తిస్థాయిలో సరిచూసుకోవాలని సూచించారు. ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని, నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అప్పాల మనోహర్, తిరుపతి, రాజన్న, రమేష్, శ్రీనివాస్, రవీందర్, గంగన్న, అరుణ, వెంకటలక్ష్మి, ధనలక్ష్మి, మల్లేశం, రవి తదితరులు పాల్గొన్నారు.
