Telugu Actors | ఎన్టీఆర్ తో సినీ పెద్దల అనుబంధం ఇదే!

Telugu Actors | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : తెలుగు సినీ పరిశ్రమలో ఒక శకం నందమూరి తారక రామారావు. ఎన్నితరాలు దాటినా ఆయన కేవలం నటుడిగా, రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, అప్పటి తరం నుంచి నేటి తరం వరకు ఎంతో మంది నటులకు ఆయన స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. సినీ ప్రపంచంలో ఎందరో అగ్ర నటులతో ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కరల్లేదు. షూటింగ్ సమయంలోనే కాదు వ్యక్తిగతంగా కూడా వారికి సలహాలు, సూచనలు ఇస్తూ వారి తోడుగా నిలిచారు ఆయన. అయితే అప్పటి తెలుగు అగ్రనటులతో నందమూరి తారక రామారావుకు ఉన్న స్నేహం గురించి ఆ నటులే పలు సందర్భాల్లో స్వయంగా చెప్పిన విషయాలు తెలుసుకుందామా..

అక్కినేనితో అజరామరమైన స్నేహం
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్–ఏఎన్నార్‌ల స్నేహం ఒక ప్రత్యేక అధ్యాయం. తెరపై ఇద్దరూ పోటీ హీరోలే అయినా, వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు ఎంతో గౌరవంతో ఉండేవారు. “మన ఇద్దరం కలిసి ఉంటే తెలుగు సినిమా బలంగా ఉంటుంది” అని ఎన్టీఆర్ అన్న మాటలను ఏఎన్నార్ అనేక సందర్భాల్లో ఎంతో గొప్పగా గుర్తు చేసుకునేవారు.

కృష్ణతో రాజకీయ భేదాలకు అతీతమైన గౌరవం..
సూపర్ స్టార్ కృష్ణతో ఎన్టీఆర్ కి రాజకీయ పరంగా భేదాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఆయన ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని ఎంతో గౌరవించేవారు. ఒక సినిమా ఫంక్షన్ వేదికపై ఎన్టీఆర్ కృష్ణ గారిని ఉద్దేశించి “చాలా కష్టపడే నటుడు” అని ప్రశంసించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.

చిరంజీవి భవిష్యత్తును ఊహించి ఆశీర్వాదం..
చిరంజీవి కెరీర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడే ఆయనలోని డ్యాన్స్ ప్రతిభను, కష్టపడే తత్వాన్ని ఎన్టీఆర్ గుర్తించారు. “ఈ అబ్బాయి భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడు” అని ఎన్టీఆర్ అప్పట్లోనే చిరంజీవిని దీవించారని సినీ వర్గాల్లో ఇప్పటికీ చెప్పుకుంటారు.

నందమూరి బాలకృష్ణకు తండ్రి, గురువు..
బాలకృష్ణకి ఎన్టీఆర్ కేవలం తండ్రి మాత్రమే కాదు, నటనలో ఒక దిశా నిర్దేశం చేసే గురువు. షూటింగ్ సెట్స్‌లో డైలాగ్ డెలివరీ, హావభావాల విషయంలో ఎన్టీఆర్ స్వయంగా సూచనలు చేసేవారని బాలకృష్ణ అనేక ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

మోహన్ బాబుకి క్రమశిక్షణ పాఠాలు..
మోహన్ బాబు ఎన్టీఆర్‌ను ఒక దైవసమానమైన వ్యక్తిగా భావిస్తారు. సమయపాలన, క్రమశిక్షణ వంటి విషయాల్లో తాను ఎన్టీఆర్ నుంచి ఎంతో నేర్చుకున్నానని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

రజనీకాంత్ .. భారతీయ సినిమాకు ఆదర్శం
సూపర్‌స్టార్ రజనీకాంత్ఎ ఎన్టీఆర్ నటనను గొప్పగా కొనియాడారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ పోషించిన పురాణ పాత్రల నటన భారతీయ సినిమాకే ఆదర్శమని రజనీకాంత్ పలుమార్లు ప్రశంసించారు.

ఎన్టీఆర్ కేవలం నటులకే కాకుండా, తెలుగు సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. తోటి నటులతో ఆయన పంచుకున్న ఈ అనుబంధాలు ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇలాంటి ఆత్మీయతలు, గౌరవాలు తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటాయి అనుబంధాలు, వారిపై ఆయన చూపిన ప్రభావం ఇప్పటికీ సినీ చరిత్రలో మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి.

Leave a Reply