విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి…

రేగొండ, ఆంధ్రప్రభ : విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపి రెడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కనుకుంట్ల గోపి (46) గురువారం ఉదయం ఇంటి ముందు మోటార్ ఆన్ చేసి డ్రంబులో నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,ఇటీవల తండ్రి సమ్మయ్య వృద్ధాప్యంతో మృతి చెందగా, మూడవ రోజు కార్యక్రమ ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు నిమగ్నమై ఉన్నారు.
రేకులకు చేయి తగిలి విద్యుత్ తీగ పేలి ఉండడంతో గమనించకుండా రేకులను పట్టుకోవడంతో విద్యుత్ షాక్ కు గురయ్యారు. రక్షించేందుకు వెళ్లిన కుటుంబ సభ్యురాలికీ స్వల్పంగా కరెంట్ షాక్ తగిలింది. కుటుంబ సభ్యులు వెంటనే పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, డ్యూటీ డాక్టర్ పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఫిర్యాదురాలు మృతుని భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై. సుధాకర్ తెలిపారు.
