మహానాడులో పార్టీకి విరాళం..

మహానాడులో పార్టీకి విరాళం..

కంకిపాడు, ఆంధ్రప్రభ: కంకిపాడు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎన్టీఆర్ సేవారత్న అవార్డు గ్రహీత యలమంచిలి కిషోర్ బాబు పార్టీ ఫండ్‌కు రూ.1,00,103 విరాళంగా అందజేశారు.

ఈడుపుగల్లులో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు పార్టీ ఫండ్ కింద రూ.1,00,103 విలువైన చెక్కును అందించారు.

ఈ సందర్భంగా యలమంచిలి కిషోర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, పార్టీ వ్యవస్థాపకుడు, తనకు స్ఫూర్తిదాయకుడైన నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా తన వంతుగా పార్టీకి విరాళం అందజేసినట్లు తెలిపారు.

పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply