బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సిఐ రంజిత్ కుమార్

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సిఐ రంజిత్ కుమార్
హన్మకొండ క్రైమ్, ఆంధ్రప్రభ : బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని సుబేదారి పోలీస్ స్టేషన్ సి.ఐ.ఎం. రంజిత్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ త్యాగానికి, ప్రేమకు, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షించారు.
ప్రతి ఒక్కరూ పండుగను ఆనందోత్సాహాల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి సుఖశాంతులతో జరుపుకోవాలని కోరారు. అలాగే పండుగ సందర్భంగా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత కోసం వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
