విజయ రెడ్డి మృతి పట్ల బీజేపీ రామచంద్ర రావు సంతాపం

విజయ రెడ్డి మృతి పట్ల బీజేపీ రామచంద్ర రావు సంతాపం

ఎడపల్లి, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి విజయ రెడ్డి (80) మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ రెడ్డి, మే 25వ తేదీన హైదరాబాద్ కొండాపూర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు.

విజయ రెడ్డి మృతిపై సమాచారం అందుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, మాజీ మంత్రి సంతోష్ రెడ్డి, వారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి (వాసుబాబు), కుమార్తె, అల్లుడు మాధవీలతలను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జస్టిస్ సుభాషన్ రెడ్డి కూడా బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రులు మండవ వెంకటేశ్వరరావు, ఇంద్రకరణ్ రెడ్డి విజయ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. కెప్టెన్ కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు, బోధన్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు మాజీ మంత్రి నివాసానికి చేరుకుని శోకసప్తప్త కుటుంబానికి తమ మద్దతును ప్రకటించారు.

Leave a Reply