యువతకు ఉజ్వల భవిష్యత్తు సీఎం చంద్రబాబుతోనే సాధ్యం..

యువతకు ఉజ్వల భవిష్యత్తు సీఎం చంద్రబాబుతోనే సాధ్యం..
మహానాడు కార్యక్రమంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు
పాయకాపురం, ఆంధ్రప్రభ : రాజధాని లేని రాష్ట్రంగా గత వైసీపీ ప్రభుత్వం తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించారని, తద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడులు వస్తున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
స్థానిక 60, 61వ డివిజన్ల క్లస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువ నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆధ్వర్యంలో యువతకు బంగారు భవిష్యత్తు కల్పించబడుతోందని అన్నారు. ఎన్టీఆర్ మహత్తర ఆలోచనలతో టీడీపీని స్థాపిస్తే, ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు పార్టీని బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కంచి దుర్గా పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు కంచి ధనశేఖర్, దాసరి కనకరావు, ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజు, బేవర సూర్య, దాసరి దుర్గారావు, ఉమ్మడి వెంకట్రావు, అమ్మరావు తదితరులు పాల్గొన్నారు.
