Coaching Center | మరో ఇద్దరు అరెస్ట్

Coaching Center | మరో ఇద్దరు అరెస్ట్
సీబీఐ దర్యాప్తు వేగవంతం
Coaching Center | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. లాతూరుకు చెందిన ఓ డాక్టర్‌తో పాటు పుణెలోని కోచింగ్ సెంటర్‌కు చెందిన ఫిజిక్స్ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
తాజా అరెస్టులతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 13కు చేరింది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పేపర్ లీక్ ఘటన నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను రద్దు చేసి, జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఉన్నత విద్యాశాఖ ఫిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. పేపర్ లీక్ వెనుక ఉన్న నెట్‌వర్క్, కోచింగ్ సెంటర్ల పాత్ర, ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
