Fire accident | ఫిషింగ్ పోర్టులో భారీ అగ్నిప్రమాదం..

ఒడిషా : జగత్‌సింగ్‌పూర్ ఫిషింగ్ పోర్టులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని పారాదీప్‌లోని నెహ్రూ బంగ్లా ఫిషింగ్ హార్బర్‌లో గురువారం సాయంత్రం ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. అన్ని పడవలు డీజిల్‌తో నడిచేవి కావడంతో, మంటలు వేగంగా తీవ్రంగా వ్యాపించాయి. దీని కారణంగా, దాదాపు 10 ఫిషింగ్ బోట్లు దగ్ధమయ్యాయి.

భారీ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, పడవల్లో ఉన్న వంట గ్యాస్ సిలిండర్లు, డీజిల్ ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలుతూనే ఉండటంతో మంటలను ఆర్పడంలో అగ్నిమాపక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.

ఈ ప్ర‌మాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, కోట్లాది రూపాయల ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్టు తెలుస్తొంది. పారాదీప్‌లోని నెహ్రూ బంగ్లా ఫిషింగ్ హార్బర్‌లో ప్రస్తుతం 50కి పైగా పెద్ద పడవలు, 400 చిన్న పడవలు ఉన్నాయి.

Leave a Reply