క్లస్టర్-7లో మహానాడు సందడి

క్లస్టర్-7లో మహానాడు సందడి

కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం

ప్రజల్లో కార్యకర్త.. ప్రజల కోసం టీడీపీ

మంగళగిరి, ఆంధ్ర‌ప్ర‌భ : మంగళగిరి నియోజకవర్గంలోని క్లస్టర్-7 పరిధి పెద్దవడ్లపూడి గ్రామంలోని వై గార్డెన్‌లో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్‌చంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం వై గార్డెన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి తెరల ద్వారా మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వీక్షించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు నాయకత్వం, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై మహానాడులో జరిగిన ప్రసంగాలను శ్రద్ధగా ఆలకించారు.

ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ప్రసంగానికి కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది. యువతకు ప్రాధాన్యత, పార్టీ బలోపేతం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలతో ఆయన చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలను పలువురు నాయకులు అభినందించారు. మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.

“కార్యకర్తను గౌరవించే సంస్కృతి తెలుగుదేశం పార్టీకే ప్రత్యేకం” అని నాయకులు పేర్కొన్నారు. ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలతోనే పార్టీ బలోపేతం అవుతుందని తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

కార్యక్రమ ప్రాంగణం మొత్తం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, నినాదాలతో సందడి వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో హాజరైన టీడీపీ శ్రేణులు మహానాడు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply