దారూరు మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ఆనంద్

దారూరు మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ఆనంద్
ధరూర్ ఆంధ్రప్రభ : మొలకెత్తిన వడ్లతో రోడ్డుపై నాట్లు వేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ నియోజకవర్గం, ధరూర్ మండలం లోని గట్టేపల్లిలో కొనసాగుతున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు ధారూర్ మండల బి.ఆర్.ఎస్ బృందం
రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దయిన వడ్లు.
కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి నెల రోజులు దాటిన ఇప్పటివరకు పూర్తికాని కొనుగోలు.
వడ్ల కుప్పల మీద వరదలై పారుతున్న వర్షపు నీరు.
రవాణా లారీలు రావడంలేదని గగ్గోలు పెడుతున్న రైతులు.
80 శాతం కొనుగోలు పూర్తి చేశామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి వాస్తవ పరిస్థితి గమనించాలనీ అన్నారు.
దారూర్ మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రంలో కూడా రవాణా లారీలు రావడంలేదని రైతులు వాపోతున్నారు.
దారూర్ మండల కేంద్రంలో జొన్నలకు కేంద్రం ఓపెన్ చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదు.
తరిగోపుల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ కొనుగోలు ప్రారంభించలేదు.
అడిషనల్ కలెక్టర్, డీసిఓ మరియు సివిల్ సప్లై అధికారులతో మాట్లాడిన డాక్టర్ మెతుకు ఆనంద్.
నాగారం మరియు మోమిన్ కలాన్లలో కూడా వడ్లు తడిసి ముద్దయినాయి.
గట్టేపల్లి, ధరూర్ టౌన్, నాగారం, మోమిన్ కలాన్, తరిగోపుల తదితర గ్రామాలను సందర్శించి సమస్యను పరిష్కరించాలనీ డిమాండ్ చేశారు.
