పీసీసీ చీఫ్‌ను కలిసిన భీమ్‌గల్ కాంగ్రెస్ నాయకులు
పీసీసీ చీఫ్‌ను కలిసిన భీమ్‌గల్ కాంగ్రెస్ నాయకులు
భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: కామారెడ్డిలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేష్ రెడ్డిని భీమ్‌గల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు పర్స అనంతరావు, భీమ్‌గల్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు, పిప్రి గ్రామ సర్పంచ్ అరిగేల జనార్దన్, బాబాపూర్ ఉప సర్పంచ్ గోవర్ధన్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మండల అభివృద్ధి, గ్రామాల సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చ జరిగింది. నాయకత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మండలంలోని గ్రామ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
