బెంగళూరు దంచికొట్టింది.. గుజరాత్‌ ముందు భారీ స్కోర్‌

బెంగళూరు దంచికొట్టింది.. గుజరాత్‌ ముందు భారీ స్కోర్‌

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌:
ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుబ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్ కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులతో విరుచుకుపడి జట్టుకు ఊపునివ్వగా, విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్యా చెరో 43 పరుగులు చేసి సహకరించారు. దేవదూత్ పడిక్కల్ 30 పరుగులతో తన వంతు పాత్ర పోషించాడు. గుజరాత్ బౌలర్లలో రబడా, హోల్డర్ తలో రెండు వికెట్లు తీసినప్పటికీ, బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ఈ కఠిన లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు వెళ్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

Leave a Reply