Tollywood actor | అనాథాశ్రమంలో సేవా కార్యక్రమాలు

Tollywood actor | అనాథాశ్రమంలో సేవా కార్యక్రమాలు
Tollywood actor | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సమాజంలోని నిరాశ్రయుల పట్ల తనకున్న బాధ్యతను గుర్తు చేస్తూ.. రంగారెడ్డి జిల్లా, నాదర్‌గుల్‌లోని ‘మాతృదేవోభవ’ అనాథాశ్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకుల సేవలను మనోజ్ ప్రత్యేకంగా అభినందించారు. ఆశ్రమంలోని వారికి అవసరమైన దుస్తులతో పాటు, మౌలిక సదుపాయాల కల్పన కోసం టేబుళ్లు, కుర్చీలను విరాళంగా అందజేశారు.
సమాజంలో ఎవరూ లేని వారికి అండగా నిలబడటం అందరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తన వంతు సహకారాన్ని నిరంతరం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మానసిక స్థితి సరిగ్గా లేని ఒక వ్యక్తిని గమనించిన మనోజ్, నిర్వాహకులతో కలిసి స్వయంగా ఆ వ్యక్తికి హెయిర్ కట్ చేశారు. ఇలాంటి చిన్నపాటి సేవల్లో పాల్గొనడం ద్వారా మనోజ్ అందరి మనసు గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
