social media | వెనుక అసలు నిజం ఇదే?

social media | వెనుక అసలు నిజం ఇదే?
social media | కూతురిపై విమర్శలపై నోరు విప్పిన స్టార్ తండ్రి!
social media |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ నటి అనన్య పాండే ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆమె నటించిన ‘చాంద్ మేరా దిల్’ చిత్రంలోని ఒక డ్యాన్స్ సీక్వెన్స్‌పై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాటలో అనన్య చేసిన డ్యాన్స్, సంప్రదాయ భరతనాట్యాన్ని అవమానించేలా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
social media | మద్దతుగా నిలిచిన చుంకీ పాండే..
ఈ వివాదంపై అనన్య పాండే తండ్రి, సీనియర్ నటుడు చుంకీ పాండే స్పందించారు. తన కూతురికి మద్దతుగా ఆయన మాట్లాడుతూ.. “చాలా మంది ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది స్వచ్ఛమైన భరతనాట్యం కాదు. కళాత్మకంగా, ప్రయోగాత్మకంగా చేసిన ఒక ‘ఫ్యూజన్ పర్ఫార్మెన్స్’. కాలేజీ ఈవెంట్లలో విద్యార్థులు చేసే తరహాలో, ఇది ఒక అడ్వాన్స్‌డ్ , క్రియేటివ్ డ్యాన్స్ మాత్రమే,” అని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
