చెట్టుకు ఉరి వేసుకొని వృద్ధుడు ఆత్మహత్య..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రానికి చెందిన గుడికందుల శంకరయ్య(67) అనే వృద్దుడు అనారోగ్య,వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం దండేపల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు దండేపల్లి ఎస్సై తహసీనోద్దిన్ తెలిపారు. ఎస్సై, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం శంకరయ్య గత కొంతకాలంగా వృధ్యాప, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం మద్యాహ్నం ఇంటి నుండి హోటల్ కు వెళ్ళి వస్తానని కుటుంబ సభ్యుల కు చెప్పి వెళ్ళి తిరిగి రాత్రి వరకు కూడా రాకపోవడంతో గ్రామంలో వెతుకగా మంగళవారం గ్రామస్థులు చెరువు వద్ద శంకరయ్య చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడని తెలిపారు. మృతును కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Leave a Reply