రూ.48.88 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రూ.48.88 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

79 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 79 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.48,88,563ల ఆర్థిక సాయం మంజూరైనట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు.

మంగళవారం మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

మైలవరం మండలానికి చెందిన 32 మందికి రూ.17,58,123ల విలువైన చెక్కులు మంజూరయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని 18 మందికి రూ.15,04,800లు, జి.కొండూరు మండలంలోని 11 మందికి రూ.6,07,453లు ఆర్థిక సాయం అందించారు.

రెడ్డిగూడెం మండలంలోని 11 మందికి రూ.5,85,702లు, విజయవాడ రూరల్ మండలంలోని ఏడుగురికి రూ.4,32,485లు సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ కింద ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు వేగంగా మంజూరు అవుతున్నాయని పేర్కొన్నారు. పేద ప్రజలు వైద్యం కోసం అప్పుల పాలుకాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్ఎఫ్ ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.