ఇంద్రకీలాద్రి భక్తులకు జనసేన మజ్జిగ పంపిణీ

ఇంద్రకీలాద్రి భక్తులకు జనసేన మజ్జిగ పంపిణీ
భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో సోమవారం రెండో రోజు ఈ సేవా కార్యక్రమం కొనసాగింది. పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని భక్తులు, పాదచారులకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బాడిత శంకర్ మాట్లాడుతూ భక్తులు ఎండలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు చిన్న సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమం వేసవి కాలం మొత్తం నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
